Tourist Family Director | ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) సినిమాతో దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అభిషాన్ జీవింత్ నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రోడక్షన్ నెం4 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ కుడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మలయాళం నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుండగా.. మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ షురూ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌తో పాటు విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించబోతుంది. ఇక ఈ సినిమాకు ‘కరెక్టెడ్ మచ్చి’ (Corrected Machi) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
MRP Entertainment & Zion Films #ProductionNo4 has officially commenced dubbing 🎙️
The team steps into the studio, enjoying every moment behind the mic and making the process truly interactive and lively.
Post-production in full swing Exciting updates loading soon 🔥… pic.twitter.com/amHSOZCWd9
— soundarya rajnikanth (@soundaryaarajni) November 10, 2025