Abhiram Trailer | టాలీవుడ్లోకి మరో యువ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం అభిరామ్. నాంది ఫేమ్ నవమి గాయక్ హీరోయిన్గా నటిస్తుంది. లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాసులు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రామకృష్ణార్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. శివ బాలాజీ, ‘కాలకేయ’ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇది నా దండికోట.. ఇక్కడ నా మాట కంచుకోట అంటూ ‘కాలకేయ’ ప్రభాకర్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దండికోట అనే గ్రామంలో ఈ కథ జరుగుతుండగా.. ఈ ఊరిలో ఉన్న ప్రధాన ద్వారాన్ని ప్రతి పౌర్ణమికి 3 రోజులు మూసివేస్తారు. ఆ మూడు రోజులు ఊరి చూట్టుపక్కలకు కూడా ఎవరు వెళ్లరు. అయితే అనుకోకుండా తన ప్రేయసి కోసం ఈ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాడు హీరో. మరి గండికోటలోకి వెళ్లిన అనంతరం యష్ రాజ్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి.? లోపలికి వెళ్లిన యష్ దండికోట నుంచి ఎలా బయటపడ్డాడు.! అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.