విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాకు మూడేళ్లు.. !

రజినీకాంత్ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో వరస విజయాలు అందుకుని మంచి మార్కెట్ సొంతం చేసుకున్న హీరో విశాల్. తెలుగబ్బాయి కావడంతో మనవాళ్లు ఈయన్ని మరింత బాగా రిసీవ్ చేసుకున్నారు. పందెంకోడి, పొగరు, భరణి లాంటి సినిమాలతో అప్పట్లో వరస విజయాలు అందుకున్న ఈయన.. తర్వాత ఫామ్ కోల్పోయాడు. అలాంటి సమయంలో విశాల్ ఈజ్ బ్యాక్ అనేలా చేసిన సినిమా అభిమన్యుడు. హీరో విశాల్ ఈ చిత్రాన్ని తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ బ్యానర్ పై నిర్మించాడు. 2018, జూన్ 1న విడుదలైన ఈ చిత్రం నేటితో 3 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని హీరోయిన్ గా నటించింది. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జున ‘ఆఫీసర్’ సినిమాకు పోటీగా విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం దానిని పూర్తిగా డామినేట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..
నైజాం- 3.10 కోట్లు
సీడెడ్- 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.56 కోట్లు
ఈస్ట్- 0.80 కోట్లు
వెస్ట్- 0.55 కోట్లు
గుంటూరు- 0.75 కోట్లు
కృష్ణా- 0.82 కోట్లు
నెల్లూరు- 0.40 కోట్లు
ఏపీ + తెలంగాణ- 9.18 కోట్లు
‘అభిమన్యుడు’ చిత్రాన్ని తెలుగులో 4.2 కోట్లకు అమ్మారు. 5 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఏకంగా 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విశాల్ కు చాలా రోజుల తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. తమిళంలో అలాగే తెలుగులో కూడా. అందుకే అభిమన్యుడు విశాల్ కెరీర్ కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

