నచ్చిన అమ్మాయి ప్రేమకోసం..
ఉదయ్‌శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండ్'. గురు పవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్ మ్యానువల్ కథానాయిక. ఒక్కపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నేడు చిత్ర హీరో ఉదయ్‌శంకర్ జన్మదినం. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ సమక్షంలో ఉదయ్‌శంకర్ బర్త్‌డే
ఉదయ్‌శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండ్’. గురు పవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్ మ్యానువల్ కథానాయిక. ఒక్కపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నేడు చిత్ర హీరో ఉదయ్‌శంకర్ జన్మదినం. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ సమక్షంలో ఉదయ్‌శంకర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఆయన మాట్లాడుతూ “ఆటగదరా శివ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశా. చిత్రసీమలో నాలుగేళ్ల ప్రయాణం పూర్తయింది. ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండ్’ కమర్షియల్ లవ్‌స్టోరీ. తనకు నచ్చిన అమ్మాయి కోసం కథానాయకుడు ఎంతదూరం వెళ్లాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అన్నదే కథాంశం. ఈ సినిమా నటుడిగా నాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తుందని భావిస్తున్నా. వైజాగ్‌లో చిత్రీకరణ జరిపాం. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి’ అన్నారు. యువత మెచ్చే ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మిగిలిన ఒక్క పాటను గోవాలో తెరకెక్కిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. జెన్నీఫర్, మధునందన్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్, గాయత్రి భార్గవి, సౌరవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్, ఆర్ట్: డౌలూరి నారాయణ, సంగీతం: గిప్టన్ ఎలియాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

