Junaid Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ (Aamir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan), స్టార్ నటి సాయి పల్లవి జంటగా ఒక సినిమా రుపోందుతున్న విషయం తెలిసిందే. మొదటగా ఈ సినిమాకు ఏక్ దిన్(Ek Din) అనే టైటిల్‌ను ప్రకటించిన తాజాగా టైటిల్‌ను మార్చినట్లు తెలిపారు. ఈ సినిమాను తాజాగా మెరే రహో (MereRaho) అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత మన్సూర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ – మన్సూర్ ఖాన్ దాదాపు 17 ఏండ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నారు. వీరిద్దరి కలయికలో 2008లో వచ్చిన ‘జానే తూ… యా జానే నా’ చిత్రం సూపర్ హిట్‌ను అందుకుంది.
AAMIR KHAN – MANSOOR KHAN REUNITE: SAI PALLAVI – JUNAID KHAN STARRER GETS NEW TITLE + NEW RELEASE DATE… #MereRaho is the new title of the film starring #SaiPallavi and #JunaidKhan… Also, the film is now slated for release on 12 Dec 2025.
Directed by #SunilPandey and produced… pic.twitter.com/rWNtkUTNDd
— taran adarsh (@taran_adarsh) September 12, 2025