ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’.అద్వైత్‌చందన్ దర్శకుడు. టామ్‌హాంక్స్ హీరోగా నటించిన హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్’కు రీమేక్‌గా తెరకెక్కించారు. కరీనాకపూర్, అక్కినేని నాగచైతన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఈ చిత్రానికి తెలుగులో అగ్ర నటుడు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో విచిత్రం అనే క్యాప్షన్స్తో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘భిన్న దశల్లో ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, కొన్ని చారిత్రక ఘటనలకు అతను ఎలా సాక్ష్యంగా నిలిచిచాడన్నదే సినిమా ఇతివృత్తం’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో బాలరాజుగా కీలక పాత్రలో కనిపించనున్నారు నాగచైతన్య.