Coolie | సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కతున్న యాక్షన్ డ్రామా చిత్రం కూలీ. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ధ్రువీకరించారు. ప్రస్తుతం మూవీ నిర్మాణంలో ఉండగా.. ఈ ఏడాది చివరలో విడుదలవనున్నది. అయితే, అయితే, మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రావొచ్చని వార్తలు వచ్చాయి. తాజాగా.. ఇక ఆమిర్ ఖాన్ 60వ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనతో కలిసి ఫొటోను లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. బర్త్‌డే విషెష్ చెప్పారు.
Wishing you a very happy birthday #AamirKhan sir 🤗🤗❤️❤️
Very grateful for the lovely conversations we’ve had. Your insights and passion for storytelling have always left me inspired.
Here’s to creating more magic on screen in the coming years and excited to share this special… pic.twitter.com/n9KwkeWaPe
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 14, 2025
‘మీకు చాలా పుట్టినరోజు శుభాకాంక్షలు అమీర్ ఖాన్ సార్. కృతజ్ఞుడను. మీతో జరిగిన అందమైన చర్చలకు కృతజ్ఞుడను. మీ లోతైన ఆలోచన, కథల పట్ల అభిరుచి నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చాయి. రాబోయే సంవత్సరాల్లో తెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన రోజును మీతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాను సార్’ అంటూ పోస్ట్ పెట్టాడు. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్‌తో ‘కూలీ’ మూవీ తెరక్కెనున్నది. యాక్షన్ థ్రిల్లర్‌గా కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్ ఈ మూవీని నిర్మిస్తున్నది. ఈ మూవీలో రజనీకాంత్ తన కెరియర్లో తొలిసారిగా డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. మరో వైపు రజనీకాంత్ కూలీతో పాటు జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. కూలీ మూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లేసే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.