సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్, నాగార్జున వంటి అగ్ర తారలు భాగం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ప్రతినాయకుడు సైమన్ పాత్రలో ఇప్పటికే విడుదల చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్ అందరిని ఆకట్టుకుంది.
గురువారం దహాగా అనే పాత్రలో అమీర్‌ఖాన్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ైస్టెలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్, తెలుగు రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్సెస్.