AAMIR KHAN| బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో ఎన్నో విభిన్న కథా చిత్రాలు చేసిన అమీర్ ఖాన్ ఈ మధ్య సినిమాల స్పీడ్ తగ్గించారు. మరి కొద్ది రోజులలో అమీర్ ఖాన్ ఆరుపదులకి చేరుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరపాలని పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయించింది. ఆయన నటించిన పలు సినిమాలని ఆ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నారట. అయితే తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘లగాన్’ గురించి ఓ ప్రోగ్రామ్‌లో ప్రస్తావించారు అమీర్ ఖాన్ . ఆరు పదుల వయసు వస్తున్నప్పటికీ తన మనసు మాత్రం 18 ఏళ్ల దగ్గరే ఆగిపోయినట్టు చెపపుకొచ్చారు. లగాన్ షూట్ టైమ్‌లో తాను ఎంతో భయపడినట్టు తెలియజేశారు. ఎందుకు ఇలాంటి సినిమా తీస్తున్నావు, ఈ సినిమా ఒక్క రోజు కూడా ఆడదు అని చాలా మంది అన్నారు. క్రికెట్ గురించి గొప్పగా తీసిన సినిమాలు అంతగా ఆడలేదు. అప్పుడు నేను లగాన్ తెరకెక్కించాను . ఆ టైమ్‌లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీ ఫ్లాప్ అవుతుందని అందరూ అనేవారు. అయితే నాకెందుకో ఆ మూవీకి కచ్చితంగా ఆదరణ లభిస్తుందని అనుకున్నా. కాని ఆ మూవీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ సూపర్ హిట్ అయింది.
ఇక అమీర్ ఖాన్ నటించిన లగాన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులని కూడా సొంతం చేసుకుంది. ఇందులో అమీర్ ఖాన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికీ ఆ చిత్రంలోని సాంగ్స్ వింటే మైమరిచిపోతాం. లగాన్కి ముందు ముందు ఆమిర్ ఖాన్ చేసిన చిత్రాలు డిజాస్టర్లు అవుతూ వచ్చాయి. ఇక లగాన్ టైంలో ఆమిర్ ఖాన్ మొత్తం డౌన్ ఫాల్లో ఉండగా, ఎంతో ధైర్యం చేసి ఈ సినిమా చేశాడు. ఎంతో నమ్మకం ఉన్నా కూడా అడుగు ముందుకు వేసేందుకు చాలా భయపడ్డాడు కాని ఈ సినిమా హిట్ కావడం అమీర్ ఖాన్‌కి మరింత ధైర్యం తెచ్చిపెట్టింది.