Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన ఫ్రాంచైజీ ధురంధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ప్రాంచైజీలో పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలువగా.. ఇప్పుడు ధురంధర్ : ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన సీక్వెల్ విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలో నయా బెంచ్ మార్క్‌లను సెట్ చేస్తోంది.
సాధారణంగా బాలీవుడ్ ఖాన్ త్రయమైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు ఏదైనా సినిమాపై స్పందిస్తే.. ఆ మూవీపై బజ్ అద్భుతంగా ఉంటుంది. తాజాగా ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్ ధురంధర్ మూవీపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ధురంధర్ ప్రాంచైజీ గురించి అమీర్ ఖాన్ సినిమా చూడకుండానే చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
‘నేనింకా సినిమా చూడలేదు.. కానీ సినిమాపై వస్తున్న ప్రశంసలను మాత్రం విన్నానన్నాడు అమీర్ ఖాన్. ధురంధర్, ఇప్పుడు ధురంధర్ 2 చాలా అద్భుతంగా స్క్రీనింగ్ అవుతున్నాయి. ధురంధర్ టీంకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు’ అమీర్ ఖాన్. ఈ కామెంట్స్‌తో ఖుషీ అవుతున్న మూవీ లవర్స్ ఈ బాలీవుడ్ ‘మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్’ రెండు సినిమాలు చూసి తన అభిప్రాయాన్ని పంచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Delhi | On ‘Dhurandhar The Revenge’ Movie, Actor Aamir Khan says, “…I’ve not seen the film yet, but I hear only praises of the film. Dhurandhar 1 and now Dhurandhar 2. Both the films have done exceptionally well, and my very best wishes to the team” pic.twitter.com/tfJupR8Gd3
— ANI (@ANI) March 26, 2026
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ