The Goat Life | ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మలయాళం సినిమాలను పక్కకు పెట్టి అవార్డులను ప్రకటించుకున్నట్లు కేరళ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయితే మలయాళ చిత్రం ఆడుజీవితం (Aadujeevitham) కు అవార్డులు దక్కకపోవడంపై దర్శకుడు బ్లెస్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ అశుతోష్ గోవారికర్ కూడా గతంలో ఆడుజీవితం (Aadujeevitham) సినిమాపై ప్రశంసలు కురిపించి ఇప్పుడేమో ఈ సినిమాలో సాంకేతిక లోపాలు ఉన్నాయని అనడం ఎంత కరెక్ట్ అని బ్లెస్సీ నిరాశ వ్యక్తం చేశారు. ఆడుజీవితంకి అవార్డులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఈ సినిమాలో నటించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్పై కోపంతో అవార్డును ప్రకటించకుండా కేంద్రం అడ్డుకుందని ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan) సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇందులోని సన్నివేశాలను తొలగించాలంటూ సినిమా విడుదలైన తర్వాత బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఇదే కారణంతో పృథ్వీరాజ్ నటించిన ఆడుజీవితం (Aadujeevitham)ని జ్యూరీ పక్కన పెట్టిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.