CSI Sanatan Movie | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలైయ్యాయి. ప్రస్తుతం ఈయన అరడజను సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్నే క్రియేట్చేశాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించింది.
ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను మార్చి 10న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే తెలిపింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తుంది. నందీని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. అనీష్ సోలోమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు.
Buckle UP!🔥
To begin the Investigation with #CSISanatan 🔍🧐
The Thrilling Trailer Blast on FEB 10th💥#CSISanatanOnMAR10th@iamaadisaikumar @narangmisha @vasanthikrishn8 @ajaysrinivasofc @dev_sivashankar @chagantiproducs @aneeshsolomon @ShekarPhotos @adityamusic @GskMedia_PR pic.twitter.com/xAJEVfYNYy
— Chaganti Productions (@chagantiproducs) February 8, 2023