ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆది పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాడని, ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు తెలిపారు.
ఈ కథలోని మలుపులు, రహస్యాలు ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: తులసీరామ్, షణ్ముగం, రమేష్ యాదవ్, దర్శకత్వం: షణ్ముగం సాప్పని.