Deva Katta | ఆంధ్ర రాజకీయాలపై దేవకట్టా వెబ్ సిరీస్.. చంద్రబాబు పాత్రలో ఎవరంటే.!
Deva Katta New Webseries | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
Deva Katta New Web Series | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవకట్టా సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామజిక సమస్యలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్టా ఒక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై (YSR – Chandrababu)అని తెలుస్తుంది. అవును వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరు అప్పుడు యూత్ కాంగ్రెస్‌లో కీలక పాత్రలను పోషించారు. అయితే వీరిద్దరు కాలేజ్‌లో ఉన్న సమయంలో వాళ్ల ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు దేవకట్టా. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాజకీయ నేపథ్యంతో కూడిన డ్రామాతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్ పాత్రలో చైతన్య రావు నటించనున్నాడని సమాచారం. జేడీఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ 70 కోట్ల బడ్జెట్‌తో రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

