వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నం 47’ ఉపశీర్షిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వినోదాత్మక అంశాల మేళవింపుతో క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది.
ఇటీవలే ైక్లెమాక్స్లోని పోరాట ఘట్టాలను చిత్రీకరించారని, ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన్నదని తెలిసింది. ఇంకా కొంత టాకీపార్ట్ మాత్రమే మిగిలి ఉందని, త్వరలో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాలో నారా రోహిత్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తనదైన శైలి హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిసింది.