అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో పాన్ వరల్డ్ సినిమా ప్రకటన ఇటీవల వెలువడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరాంతంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌మీదకు వెళ్లనుంది. భారీ విజువల్స్‌తో హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథాంశం ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారతీయ మూలాల నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ ఇదని, సూపర్‌హీరో తరహాలో ఉంటుందని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, మరికొందరేమో మాఫియా నేపథ్యంలో నడిచే కథాంశమిదని చెబుతున్నారు. ఓ ఇంటర్నేషనల్ డాన్ చుట్టూ అల్లుకున్న ఈ కథ ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని మేకింగ్‌తో ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే కథాంశం విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు.