నరేన్, ప్రీతిసుందర్ జంటగా నటించిన చిత్రం ‘ఆ గ్యాంగ్ రేపు-3’. వైరల్ షార్ట్‌ఫిల్మ్ సిరీస్ ‘ఆ గ్యాంగ్ రేపు’ టీమ్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. యోగీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నోక్షియస్ నాగ్స్ నిర్మాత.
బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని, నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూపించామని దర్శకుడు యోగీ కుమార్ తెలిపారు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఇదని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, దర్శకత్వం: యోగీ కుమార్.