Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie On OTT | ఫలితంతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్‌బాబు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. ఇంద్రగంటి మొహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా అనూహ్యంగా ఈ చిత్రం అమెజాన్‌లో విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్‌బాబు సినిమా దర్శకుడిగా నటించాడు. సుధీర్ బాబుకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. బెంచ్ స్టూడీయోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.1.18 కోట్లు మాత్రమే సాధించి సుధీర్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
Read Also:
Dhamaka Movie | దీపావళి రేసు నుండి రవితేజ తప్పుకున్నాడా?
Dhruva-2 | తెరపైకి మరో బ్లాక్ బాస్టర్ సీక్వెల్.. ‘ధృవ-2’ తెరకెక్కనుందా?
AK61 | షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ కొత్త చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
Maniratnam | మణిరత్నం ఆఫర్‌ను తిరస్కరించిన స్టార్ హీరో.. కారణం ఎంటో తెలుసా?