AK61 | షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ కొత్త చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
AK61 Shooting Wrapped | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అజిత్. 'వాలి', 'ప్రియురాలు పిలిచింది', 'గ్యాంబ్లర్' వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకన్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'వలిమై' విడుదలై బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది.
AK61 Shooting Wrapped | తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అజిత్. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకన్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘వలిమై’ విడుదలై బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. పోటీగా ‘భీమ్లానాయక్’ ఉండటంతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేయలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘తునివు’ చేస్తున్నాడు. ఈ కాంబోలో ఇది మూడో చిత్రం. కాగా ఇటీవలే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అజిత్ సరికొత్తగా కనిపించనున్నాడు. కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్‌తో కలిసి బోని కపూర్ నిర్మిస్తున్నాడు. అజిత్‌కు జోడీగా మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Gopichandh | ఆ ఫ్లాప్ దర్శకుడికి గోపిచంద్ చాన్స్ ఇచ్చాడా?
Oke Oka Jeevitham | ఓటీటీలోకి శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Maniratnam | మణిరత్నం ఆఫర్‌ను తిరస్కరించిన స్టార్ హీరో.. కారణం ఎంటో తెలుసా?
Dhamaka Movie | దీపావళి రేసు నుండి రవితేజ తప్పుకున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

