AA 23 |అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ ‘AA23’కు భారీ హైప్… మేలోనే షూటింగ్ ప్రారంభం?
AA 23 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌గా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై తాజాగా రచయిత రత్న కుమార్ కీలక విషయాలు వెల్లడించడం ఆసక్తిని మరింత పెంచింది.
AA 23 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌గా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై తాజాగా రచయిత రత్న కుమార్ కీలక విషయాలు వెల్లడించడం ఆసక్తిని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశముందని సమాచారం. రత్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించే స్థాయిలో ఉంటుందని తెలిపారు.
ఈ మూవీ స్టోరీ అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. కేవలం నటీనటులు లేదా సెట్స్ వల్ల కాదు… కథలోనే ఆ స్థాయి ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడు వారాల పాటు లోతైన చర్చలు జరిగాయని, అల్లు అర్జున్‌తో జరిగిన మీటింగ్స్ తమ టీంకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని రత్న కుమార్ వెల్లడించారు. మే రెండో వారం నుంచి పనులు మరింత వేగం అందుకుంటాయని చెప్పారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్గా తీసుకుంటారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ థీమ్‌కు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. ఒక్క థీమ్ సాంగ్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల సంఖ్యలో రీల్స్ క్రియేట్ కావడం విశేషం. అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘AA23’పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకునే కథతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AA22 x A6
- AA23
- Allu arjun
- atlee
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

