AA 22 | పుష్ప2 చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్ త్వరలో మరో వండర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందుకోసం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో అంచనాలు భారీగా పెంచేసింది. హలీవుడ్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుందని అందరు డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రోజుకొక వార్త నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అభిమానులను ఎగ్జైట్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగానే సాగుతుంది. దాదాపు ఆర్టిస్ట్‌లని ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్టు టాక్. అంతేకాక ఇందులో ఐదుగురు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారనే టాక్ నడుస్తుంది.
ఇప్పటికే నలుగురు కథానాయికలని ఫైనల్ కూడా చేశారట. ‘AA 22’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఫైనల్ అయిందని జోరుగా ప్రచారం నడుస్తుంది. దీపికా చివరిగా ‘కల్కి 2898 AD’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుందని సమాచారం. ప్రభాస్ స్పిరిట్ నుండి దీపికా పదుకొణేని తప్పించడంతో ఆమె బన్నీ చిత్రంకి సెలక్ట్ అయిందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి మరో ముగ్గురు పాపులర్ హీరోయిన్లను కూడా సెలక్ట్ చేశారని అంటున్నారు.