e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Sandeep: చిరు బ‌ర్త్ డే స్పెష‌ల్.. భార్య‌తో కొరియోగ్రాఫ‌ర్ ఆట‌

Sandeep: చిరు బ‌ర్త్ డే స్పెష‌ల్.. భార్య‌తో కొరియోగ్రాఫ‌ర్ ఆట‌

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అయ‌న‌పై అభిమానం చూపించేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది సుధాకర్ తన బార్యతో కలిసి సందెపొద్దులా కాడ అంటూ నాటి క్లాసిక్ సాంగ్‌ను పర్ఫామెన్స్ చేశారు. ఆ వీడియోను చూసి చిరంజీవి ఎంతో ముచ్చటపడ్డారు. ఆ గ్రేస్, ఆ మూమెంట్స్ అన్నీ కూడా బాగున్నాయంటూ ఆ దంపతులను ప్రశంసించారు.

- Advertisement -

ఈ ఏడాది చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్‌గా ఉన్న ఆట సందీప్ త‌న భార్య జ్యోతిరాజ్‌తో క‌లిసి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రోమో విడుద‌ల చేయ‌గా,వీరిద్ద‌రు క‌లిసి అంద‌రివాడు చిత్రంలోని కోడికూర చిల్లుగారి అనే పాట‌కు అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది.

మ‌రి ఆట సందీప్, అతని భార్య ప‌ర్‌ఫార్మెన్స్ చిరు దృష్టిని ఆకర్షిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ జంట బిగ్ బాస్ సీజ‌న్5 లో పాల్గొన‌బోతున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు.

https://www.facebook.com/watch/?v=906899326838720&t=55
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement