Bro Trailer | టాలీవుడ్ సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి బ్రో (Bro The Avatar). సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బ్రో జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సముద్రఖని, ఎస్ థమన్, సాయిధరమ్ అండ్ టీం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
కాగా పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్‌ను జులై 22న గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నారు. బ్రో మాస్ ట్రీట్ పక్కా అని ట్రైలర్ (Bro Trailer) అప్డేట్ ఇస్తూ.. కాలాతీతమైన వాస్తవం వచ్చేస్తుంది.. అంటూ సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
ఇప్పటికే మేకర్స్ బ్రో మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో కథ సాగనున్నట్టు సముద్రఖని టీజర్‌తో హింట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్‌తోపాటు సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య వచ్చే రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో, మై డియర్ మార్కండేయ పాటలకు మంచి స్పందన వస్తోంది.
A Timeless Truth is on the way 🤗#BroTheAvatar in 7 Days.#BroTheAvatarFromJuly28th pic.twitter.com/uJjAapKsP5
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 21, 2023
Bringing you the MASS TREAT #BroTrailer on 22nd July 🥳
You all will love it. pic.twitter.com/W0Cszlp0tb— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 20, 2023
బ్రో టీజర్..