మలయాళ దర్శకుడితో సూపర్‌హీరో సినిమా?
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. దాంతో ఆయన తాజా సినిమాతో పాటు భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతున్నది. ప్రస్తుతం బన్నీ..అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది.
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. దాంతో ఆయన తాజా సినిమాతో పాటు భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతున్నది. ప్రస్తుతం బన్నీ..అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అట్లీ మూవీ తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాడని, దిల్‌రాజు నిర్మాత అని ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్త జాతీయ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సూపర్‌హీరో మూవీ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. మలయాళ సూపర్‌హీరో చిత్రం ‘మిన్నాల్ మురళీ’తో బాసిల్ జోసెఫ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని, సూత్రప్రాయంగా సినిమాకు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆధునిక హంగులతో తెరకెక్కించనున్న శక్తిమాన్ కథాంశమిదని టాక్. ఓ ఇంటర్నేషనల్ స్టూడియోతో కలిసి గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని చెబుతున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

