యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏలుమలై’. హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రియాంక ఆచార్, జగపతిబాబు ప్రధానపాత్రధారులు. పునీత్ రంగస్వామి దర్శకుడు. తరుణ్ కిశోర్ సుధీర్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి భావోద్వేగపూరితమైన గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
‘కాపాడు దేవా..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా డి.ఇమ్మాన్ స్వరపరిచారు. మంగ్లీ ఆలపించారు. ఓ ప్రేమ జంట విడిపోయే క్షణాలను ఈ పాట ఆవిష్కరిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నాగభరణ, కిశోర్‌కుమార్, సర్దార్ సత్య తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అద్వైత గురుమూర్తి, నిర్మాణం: తరుణ్ సుధీర్ క్రియేషన్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్.