RC16 Movie Music Director | ‘ఆర్ఆర్ఆర్’తో రామ్‌చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో చరణ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే చరణ్, బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్సయ్యాడు. స్వరమాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తాజాగా రామ్‌చరణ్ ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఇదే గనుక ఫైనల్ అయితే 2010లో వచ్చిన ‘కొమురం పులి’ తర్వాత మళ్లీ పదమూడేళ్లకు తెలుగు రెహమాన్ స్ట్రేయిట్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మధ్యలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు పనిచేసినా.. ముందుగా తమిళంలోనే పాటలు కంపోజ్ చేశాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఏ.ఆర్ రెహమాన్ తోడవడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగే చాన్స్ ఉంది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీని తీసుకునే అవకాశాలున్నాయని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.