A.R.Ameen | మూడు రోజుల క్రితం ఏ.ఆర్ రెహమాన్ కొడుకు ఏ.ఆర్ అమీన్ ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏ.ఆర్ అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందుకు ప్రదర్శన ఇస్తుండగా పైన వేళాడుతున్న షాండలియా ఒక్కసారిగా కిందపడింది. ఆ సమయంలో ఏఆర్ అమీన్ సహా తన బృందం అంతా వేదికపైనే ఉన్నారు. అయితే ఆ షాండలియా పడిన వీళ్లకు ఏమి జరగలేదు. కొంచెం అటు ఇటు పడినా అక్కడున్న అమీన్‌కు ఆయన బృందానికి పెద్ద ప్రమాదం జరిగేది. ఈ ఘటన జరిగి మూడు రోజులైంది. కాగా అమీన్ ఇంకా ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోతున్నానని అమీన్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.
తనకు జరిగిన చేదు సంఘటన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లిదండ్రులు, ఆ దేవుడు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్లే తాను ఇవాళ బతికి ఉన్నానని లేదంటే ఘోరం జరిగి ఉండేదని ఆ ఘటనుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటీజన్లు టేక్ కేర్ అమీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమీన్.. రెహమాన్ లాగానే కంపోజర్, గాయకుడి వెలుగొందుతున్నాడు. తెలుగులోనూ అమీన్ పలు పాటలు పాడాడు. అయితే నిర్మలా కాన్వెంట్ సినిమాలోని కొత్త కొత్త భాష సాంగ్ ఇక్కడ అమీన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.