Tamannaah | అగ్ర కథానాయికలు సైతం ఐటెమ్సాంగ్స్లో నర్తించడం ఇప్పుడు మామూలైపోయింది. వారి పాటలతో సినిమాకు కావాల్సినంత ప్రచారం వస్తుండటం, సదరు గీతాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుండటంతో టాప్ హీరోయిన్స్ ఐటెంసాంగ్స్‌లో నటించడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. తాజాగా హిందీ చిత్రం ‘స్త్రీ-2’లో ‘ఆజ్ కి రాత్’ అంటూ అగ్ర నాయిక తమన్నా చేసిన ఐటెంసాంగ్ సోషల్‌మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నది. ఈ స్పెషల్‌సాంగ్ సినిమాకు చాలా ప్లస్ అయిందని అంటున్నారు.
ఈ పాటకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే పదకొండుకోట్ల వ్యూస్ లభించాయి. ఇటీవలకాలంలో ఓ ఐటెంసాంగ్‌కు లభించిన అత్యధిక వీక్షణలు ఇవేనని చెబుతున్నారు. ఐదు నిమిషాల నిడివిగల ఈ పాటకు తమన్నా రెండుకోట్లు పారితోషికం తీసుకుందని, ఇది కూడా ఓ రికార్డని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు చాలా పాపులర్ అయ్యాయి. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘స్త్రీ-2’ ఈ నెల 15న విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది.