యువహీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్నది. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు ‘హను-మాన్’ఫేం కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను 15రోజుల పాటు తెరకెక్కించారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సాయిదుర్గతేజ్ మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తారని, భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కతున్న ఈ సినిమా సాయిదుర్గతేజ్ కెరీర్లోనే మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ఇండియా సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని వారు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్.