Baahubali 2 | భారతీయ సినిమా చరిత్రను సమూలంగా మార్చేసి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఐకానిక్ మూవీ ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ నేటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడమే కాకుండా సరికొత్త రికార్డులను లిఖించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం 9 ఏండ్లు పూర్తిచేసుకున్నట్లు పోస్టర్‌ను వదిలింది.
ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడిగా నటించాడు. తమన్నా, అనుష్క హీరోయిన్లుగా నటించగా.. రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అప్పట్లోనే దాదాపు రూ.1,800 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లు సాధించి రూ.1,000 కోట్ల మార్కును అందుకున్న తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా హిందీ చిత్రసీమలో సైతం అగ్ర హీరోల రికార్డులను తుడిచిపెట్టేసి, కేవలం హిందీ వెర్షన్లోనే రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి అందరినీ విస్మయానికి గురిచేసింది. నేడు భారతీయ సినిమాలో మనం చూస్తున్న ‘పాన్-ఇండియా’ ట్రెండ్‌కు బీజం వేసిన ఘనత నిస్సందేహంగా ఈ చిత్రానికే దక్కుతుంది.
Heysaa….Rudhrassa…🔥
The sound that still echoes in our ears. 9 years for #Baahubali2 ❤️🔥#Baahubali #9YearsForBaahubali2 pic.twitter.com/4luyaX1d5W
— Baahubali (@BaahubaliMovie) April 28, 2026