Vishnu Vardhan Induri | ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీపై సినిమా.. ‘83’ మేకర్స్ ప్రకటన
1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచిన స్టోరీ ఆధారంగా ‘83’ సినిమా తెరకెక్కించాడు నిర్మాత విష్ణు వర్దన్ ఇందూరి (Vishnu Vardhan Induri).
భారత క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ కెప్టెన్సీలో 1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచిన .. స్టోరీ ఆధారంగా ‘83’ సినిమా తెరకెక్కించాడు నిర్మాత విష్ణు వర్దన్ ఇందూరి (Vishnu Vardhan Induri). కబీర్‌ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రణ్‌వీర్‌సింగ్, దీపికాపదుకొనే ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు దివంగత తమిళనాడు మాజీసీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా 83 మేకర్ ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ ( Lalit Modi) పై సినిమాను తీస్తున్నట్టు ప్రకటించారు. బీసీసీఐ నెలకొల్పిన ఐపీఎల్ 15వ సంవత్సరంలోకి (IPL 15th year) అడుగుపెట్టింది. ఈ సందర్భంగా లలిత్ మోడీపై సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. బోరియా మజుందార్ రాసిన పాపులర్ పుస్తకం మావెరిక్ కమిషనర్ (Maverick Commissioner) హక్కులను విష్ణువర్దన్ ఇందూరి దక్కించుకున్నారు. ప్రపంచ చరిత్రలో పెద్ద క్రికెట్ లీగ్ అవతరణ, ఫౌండర్ లలిత్ మోడీ అంశాల నేపథ్యంలో సినిమా సాగనుందని సమాచారం.
Read Also : Laya DJ Tillu Dance | డీజే టిల్లు పాటకు లయ అదిరిపోయే డ్యాన్స్..వీడియో హల్చల్
టాప్ స్టార్ హీరో లలిత్ మోడీ పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే మేకర్స్ సదరు యాక్టర్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు టాక్. సినిమా దర్శకుడు ఇతర వివరాలపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్.
Read Also : Aadarsh Balakrishna | నా తండ్రిని చూసి గర్వపడుతున్నా..కేజీఎఫ్ 2పై యువ నటుడి ట్వీట్
Read Also : Mahesh Babu | ఆడి ఇ-ట్రాన్‌కు ఓనర్ అయిన మహేశ్ బాబు..కారు ప్రత్యేకతలేంటో..?
Read Also : R Madhavan Son | పుత్రోత్సాహంలో స్టార్ హీరో మాధవన్..మెడల్ అందుకుంటున్న వీడియో షేర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

