7G Brindavan Colony Sequel | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా 7/G బృందావన కాలనీ (7G Brindavan Colony). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2004లో సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
సీక్వెల్లో మరోసారి రవికృష్ణ (Ravi Krishna) మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అనిత పాత్రలో జీవించేసి సినీ జనాల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది చండీగడ్ భామ సోనియా అగర్వాల్. మరి సీక్వెల్లో అనిత పాత్రను రీప్లేస్ చేసేది ఎవరంటూ తెగ చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం సెల్వరాఘవన్ టీంకు హీరోయిన్ దొరికేసింది.
ఇంతకీ ఎవరా భామ అనుకుంటున్నారా..? సీక్వెల్లో అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్గా కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్. ఈ టాలెంటెడ్ మలయాళ నటి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. అనస్వర రాజన్ పలు తమిళం, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కేరళ కుట్టి Rangiలో త్రిషతో కలిసి నటించింది. హిందీలో Yaariyan 2లో తన నటనతో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ అప్డేట్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనస్వర రాజన్ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్. సీక్వెల్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నట్టు తాజా సమాచారం.
శ్రీ సూర్య మూవీస్ చీఫ్ ఏఎం రత్నం నిర్మించిన 7G బృందావన కాలనీ రవి కృష్ణ, సోనియా అగర్వాల్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈ మూవీలో చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తమిళంలో 7G రెయిన్బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.
అనస్వర రాజన్ ఫొటోలపై ఓ లుక్కేయండి మరీ..