7/G Brindavan Colony | సాధారణంగా సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తాయి. అలా ట్రెండ్ సెట్ చేసిన సినిమా జాబితాలో ముందు వరుసలో ఉంటుంది 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony). సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
2004లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా గాసిప్ ప్రకారం సీక్వెల్ ప్రాజెక్ట్ జులైలో సెట్స్‌పైకి వెళ్లనుందట.
సీక్వెల్లో రవికృష్ణ మరోసారి హీరోగా మెరువనుండగా.. సెల్వరాఘవన్ మరోసారి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఏఎం రత్నం టీం త్వరలోనే సీక్వెల్ ప్రాజెక్ట్‌లో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రం తమిళంలో 7/G రెయిన్బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.
Virupaksha | విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. హ్యాపీ మూడ్‌లో సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరో తెలిసిపోయింది.. ఫస్ట్ లుక్ వైరల్