SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరో తెలిసిపోయింది.. ఫస్ట్ లుక్ వైరల్
SAINDHAV | వెంకటేశ్ (Venkatesh) యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సైంధవ్ (SAINDHAV) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాగే సైంధవ్ మిషన్‌లో కీలక పాత్రలో కనిపించబోయే రేణు ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
SAINDHAV | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) చాలా కాలం తర్వాత యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సైంధవ్ (SAINDHAV) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.ఈ సినిమాలో సాగే సైంధవ్ మిషన్‌లో కీలక పాత్రలో కనిపించబోయే రేణు ఎవరనేదానిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రేణుగా అందాల తార రుహానీ శర్మ (Ruhani sharma) కనిపించబోతుంది. రుహానీ శర్మకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో రుహానీ శర్మ డాక్టర్ గా కనిపించబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. మరోవైపు సైంధవ్‌లో న్యాచురల్ స్టార్ నాని (Nani) కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు శైలేష్-నాని చిట్ చాట్ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వెంకటేశ్ 75వ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో నెట్టింట ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న సైంధవ్ 2023 డిసెంబర్ 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోలో పోషిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ పాత్రఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది.
రేణుగా రుహానీ శర్మ..
Welcome to the team! @iRuhaniSharma#SAINDHAV #SaindhavOnDec22 @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/YQT0WidpFE
— Venkatesh Daggubati (@VenkyMama) April 21, 2023
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

