అద్భుతాలు చేసేవి చిన్న సినిమాలే
సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోషన్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘7డేస్ 6నైట్స్’. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకాలపై రజనీకాంత్‌తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం హైదరాబాద్‌లో చిత్ర కొత్త ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ…‘తక్కువ బడ్జెట్లో ఏదో సినిమా చేసేద్దాం అనుకోలేదు. ఓ కొత్త తరహా సినిమా తెరకెక్కించాలనే ప్రయత్నించాం.
థియేటర్స్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు..అయినా చిన్న సినిమా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో రేపు మీరే చూస్తారు. వీలైనంత తక్కువ టికెట్ రేట్లు పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్‌కు చెప్పాము. డీసెంట్ ఫిల్మ్ ఇది. యువతరంతో పాటు మిగతా ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘ఫస్ట్ కాపీ చూశాం. సంతృప్తికరంగా సినిమా వచ్చింది. సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి, హీరో రోహన్, నిర్మాత రజనీకాంత్, నాయికలు మెహర్ చాహల్, కృతికా శెట్టి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

