Shivaraj kumar | సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao) తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theater) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా శివరాజ్‌కుమార్‌తో పాటు చిత్రబృందం హాజరైంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం తాజాగా పంచుకుంది.
ఇక గోధి బన్న సాధారణ మైకట్టు (Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju), సప్త సాగరాలు దాటి (Sapta sagaralu Daati) లాంటి డిఫరెంట్ జానర్లు తర్వాత హేమంత్ రావు యాక్షన్ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
And the dream begins…I can’t wait for all of you to experience it at the theaters.
Some pics from the muhuruth of “666 Operation Dream Theatre”#666OperationDreamTheatre #666ODT pic.twitter.com/dmf94dJKB3— Hemanth M Rao (@hemanthrao11) June 21, 2025