మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తూ టాప్ హీరో రేంజ్‌కి వెళ్లాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్‌లో స్టార్ట్ చేసినట్టు తెలుపుతూ రామ్ చరణ్‌తో దిగిన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేశాడు ఆలిమ్ హకీమ్. రామ్‌చరణ్‌కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా తన రోజు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్‌తో ఆలిమ్ దిగిన పిక్ వైరల్ అయింది.
రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎప్పుడో ఒకసారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ ఫాలోయింగ్ క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్స్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.