ఓటమి శాశ్వతం కాదన్న ‘3BHK’
3BHK’ సినిమాలో భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. చూసిన వారంతా బావుందని మెచ్చుకుంటుంటే ఆనందం ఉంది.
“3BHK’ సినిమాలో భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. చూసిన వారంతా బావుందని మెచ్చుకుంటుంటే ఆనందం ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి కొడుకు తెరపై తన తండ్రిని చూసుకుంటున్నాడు. ప్రతి తండ్రీ తన కొడుకును చూసుకుంటున్నాడు. ఇందులో నేను పోషించిన ప్రభు పాత్ర చాలా విషయాలు నేర్పింది. ఓటమి అనేది పర్మినెంట్ కాదని ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీగణేష్ చెప్పాడు. అతని రైటింగ్ అద్భుతం. తెలుగు రాష్ర్టాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి స్పందన అద్భుతంగా ఉంది. శరత్‌కుమార్, దేవయాని లేకపోతే ఈ సినిమా లేదు. ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రుల్ని వారు కళ్లకు కట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన మైత్రీ మూవీమేకర్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నా’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘3BHK’. శ్రీగణేశ్ దర్శకుడు. శరత్‌కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు కీలక పాత్రధారులు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో సిద్ధార్థ్ పై విధంగా స్పందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

