
30weds21 web-series | ఒకప్పుడు సినీరంగంలో ప్రవేశించాలంటే కొన్నేళ్ళు పట్టేది. టాలెంట్ ఎంతున్నా కాని నిరూపించుకోవడానికి సరైన దారిలేక చాలా మంది వెనక్కి వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. కాని అది గతంలో ఇప్పుడు టాలెంట్ ను చూపించుకోవడానికి యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్‌లు వచ్చాయి. ఇప్పుడంత షాట్ ఫిలింస్ , వెబ్ సిరీస్‌ల కాలమైంది. సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా యువ దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా పేరున్న సినీతారలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే 2021లో వచ్చిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఛాయ్ బిస్కెట్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను పృథ్వీ వనం దర్శకత్వం వహించాడు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సీజన్ 2ను త్వరలోనే తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సీజన్2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదలచేశారు.టీజర్ ను నేడు విడుదలచేయనున్నట్లు పేర్కొన్నారు. సీజన్2 ఫస్ట్ ఎపిసోడ్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సిరీస్‌కు కథ:మనోజ్ పి, సంగీతం:జోస్ జిమ్మి, సినిమాటోగ్రఫి:ప్రత్యక్ష్ రాజు.
This valentine's month, Meet our most loved married couple, Meghana and Prudhvi again 💝
— Chai Bisket (@ChaiBisket) January 30, 2022
Presenting the first look of #30Weds21 season 2
Teaser out on 31 Jan@ananyaontweet @IamChaitanyarao @prithvi_vanam@anuragmayreddy @SharathWhat @scaler_official pic.twitter.com/EahWAhhNLh