28 Years Later Trailer | హాలీవుడ్ దర్శకుడు డానీ బాయిల్ (Danny Boyle) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో ఏకంగా 8 ఆస్కార్లను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. ఈ సినిమాతోనే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. అయితే డానీ బాయిల్ తాజాగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ’28 ఇయర్స్ లేటర్(28 Years Later). 2002లో విడుదలైన 28 డేస్ లేటర్(28), 2007లో వచ్చిన 28 వీక్స్ లేటర్(28) చిత్రాలకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ జూన్ 20, 2025న థియేటర్లలో విడుదల కానుండగా.. రెండో భాగం.. ’28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్’ 2026 జనవరిలో విడుదల కానుంది. రెండో పార్ట్‌కి నియో డాకోస్టా దర్శకత్వం వహిస్తున్నాడు.
మొదటి భాగం 28 ఇయర్స్ లేటర్ (28 Years Later) జున్ 20న విడుదల కానుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మహమ్మారిలా వ్యాపించిన రేజ్ వైరస్ వలన బ్రిటన్‌లోని ప్రజలందరూ జాంబీలుగా మారతారు. అయితే వీరిని తప్పించుకుని.. ఒక బృందం ఐలాండ్‌లో బ్రతుకుతుంటుంది. అయితే ఆ ఐలాండ్‌కు జాంబీలు ఎలా వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ. జోడీ కోమర్, ఆరోన్ టేలర్-జాన్సన్, రాల్ఫ్ ఫియన్స్, జాక్ ఓ’కానెల్, ఆల్ఫీ విలియమ్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఓపెన్‌హైమర్ నటుడు సిలియన్ మర్ఫీ ఈ చిత్రంలో జాంబీ పాత్రలో నటించబోతున్నాడు.