Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer) తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. అరుదైన ఫీట్‌ను అందుకోబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డిసెంబర్ 29న దేశంలోనే అతిపెద్ద రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. విజయవాడ బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.
A BIGGEST CUTOUT for an epic CELEBRATION🔥
Global Star @AlwaysRamCharan India’s Biggest Cutout Launch on December 29th at Vajra Grounds, Brindavan Colony, Vijayawada😎💥
RC Fans – The #GameChanger‘s Game is about to begin💥#GameChangerOnJAN10 🚁🔥 pic.twitter.com/K9OhzxqG5l
— Trends RamCharan ™ (@TweetRamCharan) December 20, 2024