దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం జపాన్లో రికార్డులు తిరగరాస్తోంది. గతేడాది అక్టోబర్లో అక్కడ ఈ సినిమా విడుదల అయింది. అప్పటి నుంచి ఈ చిత్రం 200రోజులుగా ధియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.
అంతేకాకుండా ధియేటర్లలో 29 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నఈ సినిమా బాక్సాఫీసు వద్ద 195 మిలయన్ల జపనీస్ యెన్లు (భారత కరెన్సీలో రూ.119కోట్లు) వసూలు చేసింది. గత అక్టోబర్లో RRR సినిమా 44 పట్టణాలలో 209 ధియేటర్లు, 31 ఐమాక్స్లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాను జపాన్లో 1 మిలియన్ మందికి పైగా చూశారు.
అంతేకాకుండా గత డిసెంబర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం రజినీకాంత్ ముత్తు చిత్రం నెలకొల్పిన రికార్డును ఈ చిత్రం బద్దలుకొట్టింది. అయితే 24ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ముత్తు సినిమా జపాన్లో వసూళ్లలో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ముత్తు సినిమా మొత్తంగా 400 మిలియన్ల జపనీస్ యెన్లు వసూలు చేసింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR సినిమా సాంగ్ నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే.