Bhadra Movie | మాస్ మహారాజ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో భద్ర ఒకటి. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తయింది. 2005 మే 12న విడుదలైన ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది.
బోయపాటి శ్రీను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవ్వగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, సునీల్, అర్జన్ బజ్వా వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా “తిరుమల వాసా”, “ఒ మనసా” వంటి పాటలు అయితే ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాయి.
‘భద్ర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, రవితేజకు మాస్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ప్రేమకథను జోడించి బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా రవితేజ అభిమానులకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. అయితే ఈ చిత్రం 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘భద్ర’ చిత్ర బృందానికి మరియు రవితేజకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన జ్ఞాపకాలు, విశేషాలు వైరల్ అవుతున్నాయి.
20 years of intensity, style, and pure mass appeal!
Celebrating two decades of Mass Maharaja @RaviTeja_offl’s cult classic #Bhadra – a true lover.#20YearsForBhadra#BoyapatiSrinu #MeeraJasmine @prakashraaj @ThisIsDSP @SVC_official pic.twitter.com/fm7ghy4CbD— Sri Venkateswara Creations (@SVC_official) May 12, 2025