ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూ తెరకెక్కిన సినిమా ‘1996 ధర్మపురి’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటించారు. ఈ చిత్రానికి ఆదరణ బాగుందని చెబుతున్నారు హీరో గగన్ విహారి. గతంలో అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో కనిపించిన ఈ యువ నటుడు తన కొత్త సినిమా విజయంపై స్పందించారు.
ఆయన మాట్లాడుతూ…‘నటుడు కావాలనేది నా కల.ఇంజినీరింగ్ పూర్తి చేసి పరిశ్రమకు వచ్చాను. శ్రీకాంత్ నటించిన ‘రంగా ది దొంగ’ చిత్రంలో మంచి పాత్రలో నటించాను. ఆ తర్వాత పలు చిత్రాల్లో ముఖ్యమైన క్యారెక్టర్స్ చేశాను. ‘1996 ధర్మపురి’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. సినిమాలో పాటలు, మాటలు బాగున్నాయని, సహజంగా చిత్రీకరించారని వారు చెబుతున్నారు. అన్నారు.