రఘునందన్, ఆర్యవర్థన్ రాజ్, శరద్ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘1948 అఖండ భారత్’. ఈ చిత్రాన్ని ఎంవైఎం క్రియేషన్స్ పతాకంపై ఎం.వై మహర్షి నిర్మించారు. డి. ఈశ్వర్ బాబు దర్శకుడు. పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు డి. ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ…‘నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిత్రమిది.
47 లొకేషన్స్‌లో 9 షెడ్యూల్స్ చిత్రీకరణ జరిపాం. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 12న విడుదల చేయబోతున్నాం. 1948లో దేశంలో జరిగిన ముఖ్య ఘట్టాల నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : రాజు యాదవ్, సంగీతం : ప్రజ్వల్ క్రిష్.