మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి 18 పేజెస్ (18 Pages). నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది టీం. ఇందులో భాగంగా నిఖిల్ టీం బస్సు యాత్రకు ప్లాన్ చేసింది. 18 పట్టణాల్లో యాత్ర కొనసాగుతుండగా.. ప్రస్తుతం నిఖిల్ టీం వైజాగ్‌లో ల్యాండింగ్ అయింది.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌కు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. 18 పేజెస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్ అవుతోంది.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్త నిర్మాణంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 18 పేజెస్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన 18 పేజెస్ పాటలను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కార్తికేయ 2 లాంటి భారీ సక్సెస్ తర్వాత నిఖిల్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
వైజాగ్‌లో 18 పేజెస్ టీం బస్సు యాత్ర..
All set for finding Real Life Nandini? 🔍
Ready to kick-start #18Pages in #18Cities Bus Yatra at Vizag!📝
🎟️ https://t.co/S36nPs5RjT #18PagesOnDec23 ❤️@aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @NavinNooli @lightsmith83 pic.twitter.com/jEvfPJWvnZ
— BA Raju's Team (@baraju_SuperHit) December 20, 2022
టైం ఇవ్వు పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
18 పేజెస్ ట్రైలర్..