యంగ్ హీరో నిఖిల్, అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం రూపొందుతుంది.
ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది.ఆ మధ్య చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది” అని నిఖిల్ కళ్లకు గంతల్లా పేపర్ కట్టి దానిపై రాసింది. తాజాగా నందిని పాత్రకు సంబందించిన ఓక వీడియో విడుదల చేశారు. ఇందులో అనుపమ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది.