మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, హుషారు వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన బెక్కం వేణుగోపాల్.. దీవెల శ్రీనివాసరావుతో కలిసి నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘15M’. సాయితేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్టింగ్‌గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్నదని, ఈ సినిమాలో నటించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రవికిరణ్ బోయిడాపు, సంగీతం: శశాంక్ తిరుపతి, నిర్మాణం: లక్కీ మీడియా, కేడీ అండ్ కో.