అల్లరి నరేశ్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘12A రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. డాక్టర్ అనిల్విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్కీన్‌ప్లే, సంభాషణలను అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో అల్లరి నరేశ్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.
ఇందులోని అల్లరి నరేశ్ పాత్రలో విభిన్న కోణాలుంటాయని, ‘పొలిమేర’ఫేం డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తున్నారని, ఇందులోని ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేశ్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాస సిల్వర్ స్క్రిన్.