ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి శేఖర్ కమ్ముల ‘కుబేర’ కాగా, రెండోది రజనీకాంత్ ‘కూలి’. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన ప్రత్యేక పాత్రలే పోషిస్తుండటం విశేషం. దానికి కారణాలు లేకపోలేదు. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’లో ప్రత్యేక పాత్ర చేయడానికి కారణం శేఖర్ కమ్ముల. ఆయన టేకింగ్ అంటే నాగ్‌కి ప్రత్యేకమైన అభిమానం. అలాగే పాత్రలోని కొత్తదనం నచ్చడంతో ‘కుబేర’ని నాగ్ ఓకే చేశారు. ఇందులో ఆయన మిలియనీర్‌గా కనిపించబోతున్నారు. ఓ బెగ్గర్కీ, ఓ కోటీశ్వరుడికీ మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా ఉండబోతున్నదని కోలీవుడ్ టాక్.
జూన్ 20న ‘కుబేర’ విడుదల కానుంది. ఇక నాగ్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను కేవలం రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో చేస్తున్నారు నాగ్. అయితే.. ‘కూలీ’లో నాగ్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని తెలుస్తున్నది. ఆగస్ట్ 14న ‘కూలీ’ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ తన 100వ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ సినిమాకు పా.కార్తీక్ దర్శకత్వం వహిస్తారట. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారని తెలుస్తున్నది. అక్కినేని అభిమానులకు ఇది నిజంగా గుడ్‌న్యూసే.